26.3 C
Hyderabad
Monday, August 3, 2026

పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ధన్ పాల్ శ్రీనివాస్

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

నిజామాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ధన్ పాల్ శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఈ నెల 6న జరిగిన పోలింగ్ ఓట్ల లెక్కింపు శుక్రవారం జరిగింది. ఆయన తన సమీప ప్రత్యర్థి మాజీ జిల్లా, నగర అధ్యక్షుడు అర్వపల్లి పురుషోత్తం గుప్త పై 888 ఓట్లతో గెలుపొందారు. ఈ నెల 6న జరిగిన పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికలతో పాటు మాణిక్ భవన్ ( శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల) పాలకమండలి, ఆర్య వైశ్య భవన్ కళ్యాణ మండపం,   వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటిలకు ఎన్నికలు జరిగాయి.అయితే ఎన్నికలు పారదర్శకంగా జరుగలేదని గోడవలు జరిగాయి. ఎన్నికల అధికారులకు పరస్పరం పిర్యాదులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో 7న జరగాల్సిన ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం జరిగింది. నిజామాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ధన్ పాల్ శ్రీనివాస్ ఎన్నికయ్యారు…

Dhanpal Srinivas as the President of Urban Arya Vaishya Sangam

మాణిక్ భవన్ పాఠశాల కమిటీ చైర్మన్ గా ఇంగు శివప్రసాద్ 501 ఓట్ల మెజార్టీతో , ఆర్య వైశ్య భవన్ కు ఇల్లెందుల సుధాకర్ 664 ఓట్లు , వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం కమిటీ చైర్మన్ గా పాల్తీ రవి 1365 ఓట్లతో ప్రత్యర్థిపై గెలుపోంది  ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు నియామక పత్రాలను అందజేశారు.ఈ నేపథ్యంలో సంబరాలు నిర్వహించారు.

Dhanpal Srinivas as the President of Urban Arya Vaishya Sangam

 

Dhanpal Srinivas as the President of Urban Arya Vaishya Sangam

More articles

Latest article