25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

కాలినడకన శివాలయానికి తరలివెళ్లిన భక్తులు

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రుద్రూర్ నుంచి బోధన్ పట్టణంలోని ఏక చక్రేశ్వర శివాలయం వరకు ఆదివారం ఉదయం 3:30 గంటలకు కాలినడకన భక్తులు బయలుదేరి వెళ్లారు. శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టారు. శివరాత్రి సందర్భంగా ఆయా గ్రామాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కాలినడకన వెళ్లిన వారిలో అడప సుమన్, పుట్టి సాగర్, పుట్టి సాయి, కిషోర్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, శ్రావణ్ గౌడ్, ప్రణయ్, శివ, వినయ్, ఉప్పు సుధాకర్, పప్పుల నిఖిల్, పత్తి సాయి తదితరులు ఉన్నారు.

More articles

Latest article