26.3 C
Hyderabad

ఏసీబీకి చిక్కిన అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలోని అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్  శ్రీనివాస్ ఏసీబీ వలకు చిక్కారు. రూ.70వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. చార్మినార్ జోన్ ఇన్ చార్జిగా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు.  చాంద్రాయణ గుట్ట సర్కిల్ లో అర్బన్ బయో డైవర్సిటీ వింగ్లో మొక్కల కాంట్రాక్టు కు సంబంధించిన రూ.45 లక్షల బిల్లులను అనుమతించడానికి కాంట్రాక్టర్ ను శ్రీనివాస్ రూ.2,20,000 లంచం డిమాండ్ చేశారు. దీనిలో భాగంగా రూ.70,000 లంచం తీసుకుంటుంగా ఆయన్ని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

More articles

Latest article