నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ అఫ్ ప్రాసిక్యూషన్ లక్మీ నర్సయ్య ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ లీగల్ అడ్వయిజర్ గా బదిలీ చేస్తూ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ అఫ్ ప్రాసిక్యూషన్ ఎస్. సాంబశివ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రంగపేట్ గ్రామానికి చెందిన లక్ష్మీ నర్సయ్య పడాల రామిరెడ్డి లా కాలేజ్ నుండి లా పట్టభద్రులయ్యారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్వహించిన అన్ని పరీక్షలలో ఆయన ఉత్తీర్ణుడై అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా సెలెక్ట్ అయినారు. మొదట 2008 సంవత్సరంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నిర్మల్ లో విధులు నిర్వహించారు. సెప్టెంబర్, 2022 లో నిజామాబాద్ కోర్టుకు బదిలీపై వచ్చారు. అనంతరం ఆయన నిజామాబాద్ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ అఫ్ ప్రాసిక్యూషన్ గా విధులలో ఉన్నారు.
. . . పలువురు ఎపిపి ల బదిలీ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలువురు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ను బదిలీ చేస్తూ తెలంగాణ డైరెక్టర్ అఫ్ ప్రాసిక్యూషన్ సాంబశివ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కామారెడ్డి అసిస్టెంట్ సెషన్స్ కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా లక్ష్మీ మనోజ్ఞ నియమితులయ్యారు. ఆమె ప్రస్తుతం హైదరాబాద్ ఎసిబి కోర్టు లో విధులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ మెడ్చల్ మల్కాజ్గిరి కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎ. రవిని బొనగిరి కి బదిలీ చేశారు.హన్మకొండ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉన్న వనజను హైదరాబాద్ ఏసీబి కోర్టు కు, సిరిసిల్ల కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి. లక్ష్మీ ప్రసాద్ ను మంథని కోర్టులకు బదిలీ చేశారు.
. . . ఇంచార్జీ డిడిపిఒ గా మహమ్మద్ రహీమోద్దీన్
నిజామాబాద్ మొదటి అదనపు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా విధులలో ఉన్న మహమ్మద్ రహీమొద్దీన్ ను నిజామాబాద్ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ అఫ్ ప్రాసిక్యూషన్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
