29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

డిప్యూటీ కలెక్టర్ కు డిమోషన్

Must read

📰 Generate e-Paper Clip

. తహసీల్దార్ స్థాయికి పంపించాలని ఆదేశం
న్యూఢిల్లీ, బతుకమ్మ: కోర్టు ధిక్కరణ కేసులో ఆంధ్రప్రదేశ్ లో పని చేస్తున్న డిప్యూటీ కలెక్టర్ తాతా మోహన్ రావును తహసీల్దార్ స్థాయికి డిమోషన్ చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీ కోర్టు ఆదేశించింది. సదరు అధికారి కుటుంబం రోడ్డుపై పడకూడదనే జైలు శిక్ష వేయలేదని సుప్రీంకోర్టు జడ్జి బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. తాతా మోహన్ రావు 2013లో తహసీల్దార్ గా పనిచేస్తున సమయంలో హైకోర్టు హెచ్చరికలను బేఖాతరు చేస్తూ గుంటూరు జిల్లా అడవి తక్కెళ్ళపాడులో గుడిసెలను ఖాళీ చేయించారని, దీనిపై ఆగ్రహించిన హై కోర్టు..

తమ ఆదేశాలను ధిక్కరించినందుకు మోహన్ రావుకు 2నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ 2015 మార్చి 2న తీర్పునిచ్చింది. ప్రభుత్వ భూమిని రక్షించడానికే తాను చట్టబద్ధంగా చర్యలు తీసుకున్నట్లు మోహన్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మసీహ్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి గుడిసెలను తొలగించి.. అందులో నివాసం ఉంటున్న వారిని రోడ్డు మీదికి తోసేసినప్పుడు ఇవన్నీ ఆలోచించి ఉండాల్సిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మోహన్ రావును జైలుకు పంపితే ఆయన ఉద్యోగం పోతుందని, ఆయన మొండితనం, నిర్లక్ష్య వైఖరి వల్ల కుటుంబసభ్యులు రోడ్డున పడతారు. పిల్లల చదువులు పాడైపోతాయని.. మోహన్ రావును ప్రస్తుతం ఉన్న డిప్యూటీ కలెక్టర్ స్థానం నుంచి నుంచి తహసీల్దార్ స్థాయికి డిమోట్ చేయాలని సుప్రీంకోర్టు జస్టిస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.

More articles

Latest article