30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు చేసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

  • మాచారెడ్డి వైద్యాధికారి ఆదర్శ్

 

బతుకమ్మ, మాచారెడ్డి:  ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు చేసుకోవాలని మాచారెడ్డి మండల వైద్యాధికారి ఆదర్శ్ సూచించారు. అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా  మాచారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రములో 21 మంది గర్భిణీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వీరికి అవసరమైన రక్తపరీక్షలు చేసి, మందులు పంపిణి చేశారు . అందరూ కచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రి లోనే కాన్పు చేసుకోవాలన్నారు.  గర్భిణీ సమయములో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశాలు పాల్గొన్నారు.

More articles

Latest article