ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు చేసుకోవాలి
మాచారెడ్డి వైద్యాధికారి ఆదర్శ్ బతుకమ్మ, మాచారెడ్డి: ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు చేసుకోవాలని మాచారెడ్డి మండల వైద్యాధికారి ఆదర్శ్ సూచించారు. అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా మాచారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రములో 21 మంది గర్భిణీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వీరికి అవసరమైన రక్తపరీక్షలు చేసి, మందులు పంపిణి చేశారు . అందరూ కచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రి లోనే కాన్పు చేసుకోవాలన్నారు. గర్భిణీ సమయములో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశాలు పాల్గొన్నారు.