నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ – (సి బి సి ఎస్) బి ఏ, బీకాం, బిఎస్సి, బిబిఏ, బిసి, రెండవ, నాలుగవ,ఆరవ సెమిస్టర్ రెగ్యులర్, ఒకటవ, మూడవ, ఐదవ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలు శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి. ఉదయం జరిగిన పరీక్షలకు 7189 మంది విద్యార్థులకు 6709 మంది విద్యార్థులు హాజరయ్యారుకాగా 460 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 829 మందివిద్యార్థులకు 724 మంది విద్యార్థులు హాజరయ్యారు కాగా 108 మంది విద్యార్థులు గైర్హాజయ్యారని ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు.
