24.2 C
Hyderabad

డిగ్రీలో అడ్మిషన్లు షురూ..!

Must read

📰 Generate e-Paper Clip

  • 28 వరకు చివరి గడువు
  • ప్రిన్సిపాల్ డాక్టర్ సైదా జైనబ్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: నగర శివారులోని నాగారంలో గల గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం ప్రక్రియ ప్రారంభించామని ఆ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సైదా జైనబ్ తెలిపారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ 2024- 25 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ నెల 28 లోపు తమ కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలని కోరారు. డిగ్రీలో బీ జెడ్ సీ, ఎం జెడ్ సీ, ఎంపీసీఎస్, ఎంఏసీఎస్, బీబీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తామన్నారు. ఒక్కో గ్రూప్ లో ఎస్సీ(01), బీసీ (01), ఓసీ (01) సీట్లు ఉంటాయని, మిగిలిన అన్నీ సీట్లు ఎస్టీలతో మాత్రమే భర్తీ చేస్తామన్నారు.  ఇంటర్ మెమో, బోనఫైడ్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ లు సమర్పించాలన్నారు. పూర్తి మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తామన్నారు.

More articles

Latest article