31 C
Hyderabad

అనుమానాస్పద స్థితిలో యువకుని మృతి…

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

రుద్రూర్ మండలంలోని అంబం (ఆర్) గ్రామానికి వెళ్లే రహదారి ప్రక్కన రుద్రూర్ గ్రామానికి చెందిన కాడే చిన్న సాయిలు (35) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బుధవారం ఉదయం స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. బోదన్ రూరల్ సీఐ విజయ్ బాబు, రుద్రూర్ ఎస్సై సాయన్న ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందడా అనుమానిస్తున్నారు. ఐతే సాయిలు ఓంటిపైన ఉన్నగాయాలు అనుమానాలను రెకేత్తిస్తున్నాయి.  సాయిలు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై సాయన్న కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

More articles

Latest article