24.1 C
Hyderabad
Monday, August 3, 2026

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి వర్థంతి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బోధన్ : కల్దుర్కి గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ ముద్దుబిడ్డ, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి వర్థంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాజపేయి గారి సేవలను స్మరించుకున్నారు. ఆయన ప్రవేశపెట్టిన చట్టాలు, నదుల అనుసంధానం, పరిణతి చెందిన రాజకీయ నైపుణ్యం, విప్లవాత్మక నిర్ణయాలు దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించాయని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల కార్యదర్శి జంగం వెంకటేష్, గ్రామ మాజీ ఉపసర్పంచ్ న్యాలం శ్రీనివాస్, బూత్ అధ్యక్షులు రామ్, శివతో పాటు కార్యకర్తలు గంగా కిషన్, అశోక్, సాయిలు, ధర్మయ్య, గంగాధర్, అశోక్ పటేల్, శంకర్, భూమ, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article