హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మాలలకు జరిగిన అన్యాయాలపై మాల జాతి అభివృద్ధి కోసం చర్చించడానికి రాష్ట్ర నాయకుల సమావేశం సూర్య లోక్ కాంప్లెక్స్ అబిడ్స్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి డా. బి. ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ చెరుకు రామచందర్, సక్కి గంగాధర్, మందాల భాస్కర్, బీర రాజేశ్వర్, రావుల అంజన్న రావులు (OU) హైదరాబాద్ హాజరయ్యారు. ఈ సమావేశంలో నిజామాబాద్ కు చెందిన గోపు మోహన్, డిచ్ పల్లి మండలం లోల కు చెందిన ధోడ చంద్రకాంత్, నిజామాబాద్ కు చెందిన మర్రి కిరణ్ కుమార్, నవీపేట్ మండలం నందిగామకు చెందిన పెద్దోళ్ల పోశెట్టి ( బుజ్జి) లకు దళిత రత్న అవార్డులు ప్రదానం చేశారు.
