తిరుపతి, బతుకమ్మ : ఐబొమ్మ రవి, హిడ్మాలపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ఐబొమ్మలో తాను సినిమాలు ఫ్రీగా చూశానని పేర్కొన్నారు. ఆరేడు వందలు పెట్టి ఎలా చూసేది అని ఆయన ప్రశ్నించారు. అద్భుతమైన తెలివితేటలు ఉన్న రవి అలా మారడానికి కారణం ఈ వ్యవస్థలే కారణమని, వ్యవస్థలో లోపాలను సరిచేయకుండా ఉంటే ఇలాంటి రవిలే పుట్టుకు వస్తారని వ్యాఖ్యనించారు. ఒక హిడ్మాను చంపితే వెయ్యి మంది హిడ్మాలు పుడతారని పేర్కొన్నారు. ఐబొమ్మరవిని ఉరిని తీస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని, సినిమా మాఫియాను ఉరి తీస్తే సమాజానికి ఉపయోగం ఉంటుందన్నారు. కోట్లాది రూపాయలు దోచుకున్న వారిని ఐబొమ్మ రవి దెబ్బ కొట్టారని పేర్కొన్నారు.
