25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఏకచక్రేశ్వర ఆలయంలో సీపీ పూజలు

Must read

📰 Generate e-Paper Clip

 

బోధన్, బతుకమ్మ :

 

బోధన్ మహాశివరాత్రి సందర్భంగా పట్టణంలోని ఏక చక్రేశ్వర స్వామి దేవాలయంను పోలీస్ కమిషనర్ సాయిచైతన్య ఆదివారం సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చకులు గణేష్ మహారాజ్ మహేష్ పాటక్ ఆశీర్వచనం తీసుకున్నారు. అలాగే బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. పండుగ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు కమిషనర్ సూచించారు. ఆలయ పరిసరాల్లో పోలీసు సిబ్బంది మోహరింపు, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల రద్దీ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ రాములు, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, ఎస్‌హెచ్ఓ వెంకట నారాయణ, ఎస్‌ఐలు భాస్కరచారి, మనోజ్ తదితరులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

 

 

CP worships at Ekachakraswara Temple

More articles

Latest article