26.3 C
Hyderabad
Monday, August 3, 2026

అవినీతి నిరోధక శాఖ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన సీపీ

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లాలో నూతన అవినీతి నిరోధక శాఖ కార్యాలయాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో పాత ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ దగ్గర ఏసీబీ నూతన కార్యాలయాన్ని సోమవారం సీపీ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏసీబీ కి ఫిర్యాదు చేయాలనుకుంటే టోల్ ఫ్రీ నెంబర్ 1064 కి కాల్ చేయాలని సూచించారు. ఈ ప్రారంబోత్సవానికి హైదరాబాద్ ఏసీబీ వెస్ట్ జోన్ డిప్యూటి డైరెక్టర్ డి. కమలాకర రెడ్డి, నిజామాబాద్ ఏసీబీ డిఎస్పి జి.శేకర్ గౌడ్, ఇన్స్ పెక్టర్స్ యం.వేణుకుమార్, జి.నగేష్, ఏసీబీ సిబ్బంది హాజరయ్యారు.

 

CP inaugurates new office of Anti-Corruption Department

More articles

Latest article