30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

మండల కేంద్రాల్లో చేపల మార్కెట్ల నిర్మాణం

Must read

📰 Generate e-Paper Clip

తాడ్వాయి, బతుకమ్మ: మండల కేందరంలోని శబరిమాత చెరువులో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదివారం చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాసిరకం చేప పిల్లలను పంపిణీచేసి మత్స్యకారులను మోసం చేసిందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి మత్స్యకారులకు నాణ్యమైన చేప పిల్లలను వందశాతం రాయితీపై అందించాలని అధికారులను ఆదేశించారని తెలిపారు. తన వంతుగా ప్రతి మండల కేంద్రంలో చేపల మార్కెట్ నిర్మిస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.


Construction of fish markets in mandal centres

More articles

Latest article