25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసే కుట్ర

Must read

📰 Generate e-Paper Clip

కేసీఆర్‌ కు దూరం పెంచే యత్నం

వెన్నుపోటు పొడవడం నాలక్షణం కాదు

కావాలనే ఎంపీ ఎన్నికల్లో ఓడించారు

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు

  హైదరాబాద్, బతుకమ్మ : బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు, కేసీఆర్‌ కు మధ్య దూరం పెంచే యత్నం జరుగుతోందని ఆరోపించారు. హైదరాబాద్ లో మీడియా చిట్ చాట్ లో గురువారం కవిత మాట్లాడారు.  తాను జైలులో ఉన్నప్పుడే ఈకుట్ర మొదలైందన్నారు.  పార్టీ సోషల్‌ మీడియాలో తానని టార్గెట్‌ చేశారన్నారు. ఆలేఖ లీక్‌ చేసిందెవరో చెప్పాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు. నన్ను దూరం చేస్తే ఎవరికి లాభమో అందరికీ తెలుసని పేర్కొన్నారు. సొంత పార్టీ వాళ్లే కుట్రచేసి, కావాలనే తనని ఎంపీ ఎన్నికల్లో ఓడించారన్నారు.  తాను అసలే మంచిదాన్ని కాదన్నారు.  తాను నోరు తెరిస్తే బాగోదన్నారు. నాన్నకి తాను లేఖ రాస్తే మీకు ఏంటి నొప్పి అని ప్రశ్నించారు.  కేసీఆర్ ఒక్కడే నాకు బాస్ అని స్పష్టం చేశారు. తన మీద పడి ఏడిస్తే ఏం ఉపయోగం అని ప్రశ్నించారు. నన్ను పార్టీ నుంచి బయటకు పంపేంత సీన్ ఎవరికీ లేదన్నారు.  ఇంకో 30 ఏళ్లు తాను రాజకీయాల్లో ఉంటానన్నారు. కాంగ్రెస్ తో సంప్రదింపులని జరుగుతున్న ప్రచారం శుద్ధ అబద్ధమన్నారు. వెన్నుపోటు పొడవడం నాలక్షణం కాదు.. నేరుగానే పోరాడతానని పేర్కొన్నారు.

More articles

Latest article