. . . నూతన మండల అధ్యక్షుల నియామకం
జుక్కల్, బతుకమ్మ :
ప్రజలకు చేరువగా ఉండి, పార్టీ సిద్ధాంతాలను బలోపేతం చేస్తూ కాంగ్రెస్‌ను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పిలుపునిచ్చారు. మంగళవారం జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కీలక అడుగు పడింది. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, జుక్కల్ ఎమ్మెల్యే మార్గదర్శకత్వంలో నూతన మండల అధ్యక్షులను నియమించారు. ఈ నియామకాలతో పార్టీకి గ్రామస్థాయి నుంచి మరింత బలం చేకూరుతుందని, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొంటుందని ఎమ్మెల్యే తెలిపారు. నియమితులైన మండల అధ్యక్షులు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ, ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండాలని ఆకాంక్షించారు.
