29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

కాంగ్రెస్ ప్రజలకు మెరుగైన పాలన అందిస్తుంది

Must read

📰 Generate e-Paper Clip

 

. . . అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :

 

ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి రెండింటిని సమన్వయం చేస్తూ..ప్రజలకు మెరుగైన పాలన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ అసెంబ్లీ లో ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా రంజక బడ్జెట్ అని ఆయన పునరుద్ఘాటించారు. ఈ మేరకు బడ్జెట్ అనంతరం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడారు. రూ.3,24,234 కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల వారికి సముచిత ప్రాధాన్యం ఇస్తుందని, విద్య,వైద్యం, వ్యవసాయానికి ఈ బడ్జెట్ పెద్దపీట వేసిందన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో అన్నివర్గాల ప్రజల ప్రయోజనార్థం “ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం” ద్వారా 1 కోటి 15 లక్షల మందికి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం గొప్ప విషయమన్నారు. ఇది అనుకోని సంఘటనల్లో కుటుంబాలు చిద్రంకాకుండా ఆదుకునేందుకు దోహదపడుతుందని తెలిపారు. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు బేష జాలాలు లేకుండా అన్ని రంగాల్లోని ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అనేది హర్షించదగ్గ విషయమని కొనియాడారు. యావత్తు తెలంగాణ ఉద్యోగులు దీన్ని స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు పోషకాహారం అందించడంలో భాగంగా బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు తో పాటు అటు ఇంటర్మీడియట్ విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజనం ప్రవేశపెట్టడం తమ ప్రభుత్వ దార్శనికత్వానికి నిదర్శనమన్నారు. ఇలా అన్ని వర్గాల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని రూపొందించిన బడ్జెట్ స్వాగతనీయమన్నారు. అటు అసెంబ్లీలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే లు వ్యవహరించిన తీరును ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు. అధికారం కోల్పోయిన బాధతో పాటు, రాబోవు రోజుల్లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న భయంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే లు ఏమి మాట్లాడుతున్నారో వారికే తెలియడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి తమ ప్రియమైన నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తుంటే, బిఆర్ఎస్ ఎమ్మెల్యే లు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. పదేళ్లు దోపిడి రాజ్యమేలిన వీరు ఇప్పుడు దోపిడి గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

More articles

Latest article