రాజీవ్ మెమోరియల్ సధ్బాబావన్ జ్యోతి యాత్ర కు స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు

0 6,865

 

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:

తమిళనాడు రాష్ట్రం పెరంబుర్ లో ప్రారంభమైన రాజీవ్ మెమోరియల్ సద్భావన  జ్యోతి యాత్ర నిజామాబాద్ కు చేరుకుంది. ఆదివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం వద్ధ నిజామాబాద్ అర్బన్ డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ , జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి , రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్ లు సాధారంగా ఆహ్వానం పలికారు.

Congress leaders welcome Rajiv Memorial Sadhbabavan Jyoti Yatra

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి దివంగత నేత రాజీవ్ గాంధీ చేసిన సేవలు దేశం గర్వంగా స్మరించుకుంటోందనీ అన్నారు..దేశం స్వాతంత్ర్యం కోసం, డెవలప్మెంట్ కోసం ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబంలో జన్మించిన రాజీవ్ గాంధీ 1984 నుంచి 1989 వరకు భారత దేశ 6వ ప్రధానమంత్రిగా సేవలందించారన్నారు.ఆయన పాలనలో టెలికమ్యూనికేషన్, సాంకేతిక విజ్ఞానం, విద్యా రంగంలో కీలక సంస్కరణలు చేపట్టిన ఆధునిక భారత నిర్మాణానికి బలమైన పునాది వేశారన్నారు. యువత సాధికారత, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు అని అన్నారు.ఆధునిక భారత దేశ నిర్మాణానికి ఆయన కలిగిన దూరదృష్టి నేటికీ యువతకు ప్రేరణ గా నిలుస్తుందని ఈ సందర్భంగా  ఘన నివాళులు అర్పించారు. రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించిన శ్రీ పెరంబుదూరు నుంచి ఢిల్లీ వరకు ఈ సద్భావన జ్యోతి యాత్ర జరుగుతుందని అన్నారు. దానికి కాంగ్రెస్ శ్రేణులు నీరాజనం పలుకుతున్నారని పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జగడం సుమన్, సాయి కుమార్ గౌడ్  తదితరులు పాల్గొన్నారు.

Congress leaders welcome Rajiv Memorial Sadhbabavan Jyoti Yatra

Leave A Reply

Your email address will not be published.