బతుకమ్మ : నాగిరెడ్డిపేట : రాష్ట్ర హైకోర్టు జడ్జ్ విజయ సేనారెడ్డిని గురువారం నాగిరెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. హైకోర్టు జడ్జి విజయ సేనారెడ్డి మండలంలోని రాఘవపల్లి గ్రామంలో తమ బంధువుల కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తుండగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు, నాగిరెడ్డిపేట మాజీ సర్పంచ్ విట్టల్ రెడ్డి గారి విట్టల్ రెడ్డి హైకోర్టు జడ్జిని మర్యాదపూర్వకంగా కలిసి, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నర్సింహారెడ్డి, గడ్డం బాల్ రెడ్డి, ఫారుక్, సుధాకర్, కిషన్ రెడ్డి, నారాయణరెడ్డి, రమేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.
