బాన్సువాడ, బతుకమ్మ :
బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అబ్దుల్ ఖాలేక్ కాలనీలో తిరుగుతూ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను నేరుగా కలిసి వార్డులోని సమస్యలను తెలుసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అందించే హామీలను వివరించారు. ప్రచారంలో భాగంగా రోడ్లు, డ్రైనేజీలు, గల్లీల అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు తాను ప్రాధాన్యం ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రతి సమస్యను గుర్తించి తక్షణమే పరిష్కరించే విధంగా పనిచేస్తానని అబ్దుల్ ఖాలేక్ తెలిపారు. గతంలో ఐదు సంవత్సరాలుగా ఉప సర్పంచ్గా పనిచేసిన అనుభవం ఉంది. ప్రజా సేవలో ఎంతో ఉపయోగపడుతుందని, అలాగే సుమారు 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీతో కొనసాగుతున్న అనుబంధంతో ప్రజల విశ్వాసాన్ని ఎల్లవేళలా నిలబెట్టుకుంటానని ఆయన పేర్కొన్నారు. తనను 13వ వార్డు నుంచి ఓటు వేసి భారీ మెజారిటీతో ఆశీర్వదించాలని కోరారు.
