13వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ ఖాలేక్ ఇంటింటా ప్రచారం

  బాన్సువాడ, బతుకమ్మ :   బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అబ్దుల్ ఖాలేక్ కాలనీలో తిరుగుతూ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను నేరుగా కలిసి వార్డులోని సమస్యలను తెలుసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అందించే హామీలను వివరించారు. ప్రచారంలో భాగంగా రోడ్లు, డ్రైనేజీలు, గల్లీల అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు తాను ప్రాధాన్యం ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రతి సమస్యను గుర్తించి తక్షణమే పరిష్కరించే విధంగా పనిచేస్తానని అబ్దుల్ ఖాలేక్ తెలిపారు....