25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

బాన్సువాడ మున్సిపాలిటీ ఓటరు లిస్టులో గందరగోళం

Must read

📰 Generate e-Paper Clip

 

* దొంగ ఓట్లు తొలగించాలని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బిజెపి ధర్నా

బాన్సువాడ బతుకమ్మ :

బాన్సువాడ మున్సిపల్ పరిధిలో అన్ని వార్డుల్లో ఉన్న దొంగ ఓట్లను తొలగించి, పట్టణంలో నివాసం ఉన్న వారికే ఓటు హక్కు కల్పించాలని కోరుతూ మంగళవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు కోణాల గంగారెడ్డి మాట్లాడుతూ బాన్సువాడ పట్టణంలో అధికార పార్టీకి చెందిన నాయకులు తమకు అనుకూలంగా ఉండేందుకు వార్డులలో ఒక వర్గానికి చెందిన ఓట్లను చేర్చడం ఎంతవరకు సమంజసమని, 9వ వార్డులోని ఓట్లను ఒకటో వార్డులోకి, ఆరో వార్డులో ఏకంగా 400 ఓట్లు పెరగడం ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు అధికారులు వత్తాసు పలుకుతున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా నడపాల్సి ఉన్నప్పటికీ అధికారులు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు.. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో ఓట్లు వేసిన వారు సైతం మున్సిపాలిటీలో ఓట్లు వేసేందుకు ఓటర్లుగా నమోదు కావడం అధికారుల పనితీరుకు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నత అధికారులు బాన్సువాడ మున్సిపాలిటీ ఓటర్ల జాబితాలో జరుగుతున్న అవకతవకలపై ఎన్నికల అధికారులు సమగ్ర సర్వే చేపట్టిన తర్వాతే మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించాలని బాన్సువాడ సబ్ కలక్టర్ కిరణ్మయికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు చీదరసాలు, బిజెపి జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్,బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి చిరంజీవి ఉమేష్,మాజీ అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్, మాజీ ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ,మాజీ ఎంపిటిసి దాకాయ్య, బిజెపి కౌన్సిలింగ్ నెంబర్ ప్రసాద్, బిజెపి పట్టణ ఉపాధ్యక్షులు గజ్జల మహేష్, రామకృష్ణ అనిల్ శివశంకర్. నసుర్లబాద్ మండల అధ్యక్షులు హనుమాన్లు, బీర్కూర్ మండల అధ్యక్షులు సాయి కిరణ్,బిజెపి నాయకులు చీకట్ల రాజు, పాశం భాస్కర్ రెడ్డి,కొండని గంగారం, తోట శంకర్, శ్రీకాంత్,రాజాసింగ్ సాయిబాబా,శ్యామ్ తదితరులు పాల్గొన్నారు..

Confusion in Banswada Municipality voter list

More articles

Latest article