24.7 C
Hyderabad
Monday, August 3, 2026

గందరగోళం… అయోమయం…

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మెండోరా : రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ గురుకులల ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆదివారం నిర్వహించారు. మెండోరా మండలం పోచంపాడ్ సాంఘిక సంక్షేమ గురుకుల ప్రవేశపరీక్ష కేంద్రంలో రెండు అనుకొనని సంఘటనలు నెలకొన్నాయి. మొదటిది ఒక విద్యార్థి హాల్ టికెట్లో విద్యార్థి పేరు బదులు తల్లి పేరు ప్రచురితమైంది. రెండవది ఒక విద్యార్థికి ఆదాయ సర్టిఫికెట్ల ల్లో రూ. రెండున్నర లక్షల ఆదాయం ఉండడంతో  విద్యార్థికి ప్రవేశపరీక్ష రాయనివ్వలేదు. ఈ విషయంపై బతుకమ్మ పాఠశాల ప్రిన్సిపాల్ గోదావరిని సంప్రదించగా ఒక విద్యార్థి హాల్ టికెట్లో గాని, నామినల్ రూల్స్ లో అతని పేరు లేదు. అందువల్ల అవి విద్యార్థిని అనుమతించలేదని అలాగే మరో విద్యార్థికి ఆదాయం రెండున్నర లక్షలు ఉండడంతో ఓఎంఆర్ సీటు రాలేదని వివరణ ఇచ్చారు.

More articles

Latest article