28.2 C
Hyderabad

బాల్కొండ పోలీసులపై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు

Must read

📰 Generate e-Paper Clip

 

బాల్కొండ, బతుకమ్మ :

 

బాల్కొండ గ్రామానికి చెందిన ముగ్గురు మైనార్టీ యువకులపై బాల్కొండ పోలీసులు చితకబాదిన ఘటనపై బాధితుడు ఇర్ఫాన్ ఖాన్, మర్కజ్ కమిటీ ఉపాధ్యక్షులు కలిసి మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో శనివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్కొండ కు చెందిన ముగ్గురు యువకులు ఇటీవల జరిగిన ఒక గొడవ విషయంలో పోలీసులు స్టేషన్ కి తీసుకువెళ్లి చితకబాదిన ఘటనపై బాల్కొండ పోలీసులపై జిల్లా కలెక్టర్ కు, జిల్లా పోలీస్ కమిషనర్ కు, ఆర్మూర్ డివిజన్ ఏసిపికి, ఆర్మూర్ సి ఐ లకు గత వారం రోజుల క్రితమే ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో, కనీసం విచారణ చేపట్టక పోవడంతో, మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించి న్యాయం కోసం ఫిర్యాదు చేయడం జరిగిందని వారు తెలిపారు. మానవ హక్కుల కమిషన్ అధికారులు స్పందించి, ఈ సంఘటనకు పాల్పడ్డ పోలీసులపై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని వారు కోరారు.

More articles

Latest article