29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

బోధన్ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు కమిషనర్‌కు సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

 

బోధన్, బతుకమ్మ :

 

బోధన్ మున్సిపల్ ఎన్నికలను సజావుగా, పారదర్శకంగా నిర్వహించినందుకు మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణను నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ లో సోమవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శాలువాతో సన్మానించారు. ఎన్నికల ప్రక్రియను శాంతియుత వాతావరణంలో పూర్తి చేయడంలో కమిషనర్ చూపిన చురుకుదనం, సమన్వయంతో కూడిన వ్యవహార శైలి అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బంది క్రమశిక్షణ, ప్రజల సహకారం వల్లే ఎన్నికలు విజయవంతంగా ముగిశాయని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణలో భాగమైన అధికారులను, సిబ్బందిని కూడా అభినందించిన కలెక్టర్, భవిష్యత్తులోనూ ఇదే విధమైన బాధ్యతాయుత సేవలను అందించాలని సూచించారు.

More articles

Latest article