29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

పత్రీజీ ధ్యాన మహా యాగానికి తరలిరండి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నందిపేట్ : ప్రపంచ శాంతి కోసం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రీజీ గారి ఆశయ సాధనలో భాగంగా, మహేశ్వర మహా పిరమిడ్, అన్మాస్‌పల్లి గ్రామంలో డిసెంబర్ 21 నుండి 31 వరకు పత్రీజీ ధ్యాన మహా యాగం నిర్వహించబడుతుందని పిరమిడ్ సొసైటీ అధ్యక్షుడు సాయికృష్ణ రెడ్డి  పత్రిక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖండ ధ్యానం, సాంస్కృతిక కార్యక్రమాలు, పిరమిడ్ మాస్టర్ల అనుభవాలు, ఆధ్యాత్మిక సందేశాలు ఉంటాయన్నారు. నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమం బాలయోగి శ్రీ రాములు మహారాజ్  ముఖ్య అతిథిగా హాజరవుతారని, ప్రజలందరూ ఈ మహా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

More articles

Latest article