ఫెసిలిటేషన్ సెంటర్ ను సందర్శించిన కలెక్టర్

0 8,822

 

. . . పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ పరిశీలన

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం సందర్శించారు. ఎంత మంది పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫెసిలిటేషన్ సెంటర్ లో ఏర్పాట్లను, అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ఆదివారం సాయంత్రం నాటితో ముగియగా, కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు మధ్యన కౌంటింగ్ హాల్ కు తరలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కాగా, ఎన్నికల విధుల్లో నియమించబడినపోలీసు సిబ్బంది చివరి రోజైన ఆదివారం నాడు పెద్ద సంఖ్యలో ఐ.డీ.ఓ.సీ లోని ఫెసిలిటేషన్ సెంటర్ కు తరలివచ్చి పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డిప్యూటీ కమిషనర్ రవిబాబు, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజ్ తదితరులు ఉన్నారు.

 

 

Collector visits facilitation center
Collector visits facilitation center
Collector visits facilitation center
Collector visits facilitation center

Leave A Reply

Your email address will not be published.