పాలిటెక్నిక్ కళాశాలను పరిశీలించిన కలెక్టర్

0 8,676

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను పరిశీలించారు. త్వరలోనే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో నిజామాబాద్ నగర పాలక సంస్థకు సంబంధించిన ఓట్ల లెక్కింపు, ఎన్నికల సామాగ్రి పంపిణీ, బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ వంటి వాటి కోసం ఈ కళాశాలలో అనువుగా ఉన్న ఆయా విభాగాల గదులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రవాణా, పార్కింగ్ సదుపాయాలతో పాటు, భద్రతాపరమైన అంశాలను పరిశీలన జరిపారు. నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఇతర అధికారులతో కౌంటింగ్, డిస్ట్రిబ్యూషన్ కు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఎలాంటి అవాంతరాలకు తావులేకుండా మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ సాఫీగా జరిగేలా, అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.

 

Collector inspects Polytechnic College
Collector inspects Polytechnic College
Collector inspects Polytechnic College
Collector inspects Polytechnic College

Leave A Reply

Your email address will not be published.