బతుకమ్మ, బోధన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెగడపల్లి గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఎసీఎస్) లో నిల్వ ఉన్న ఎరువుల నిల్వలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గారు రైతులకు సరిపడేంత ఎరువులు అందుబాటులో ఉన్నాయా? యూరియా సరైన మోతాదులో లభిస్తున్నదా? అనే విషయాలను అక్కడే రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ విడిసి చైర్మన్ మేడి రవి, రైతులు చిన్నారెడ్డి, బీరయ్య, ఆడెళ్లి యాసిన్, రసూల్, పోశెట్టి, సాయిలు, గంగాధర్, అనిల్ తో పాటు సహకార సంఘం సిబ్బంది పాల్గొన్నారు.

