జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

0 17,874

కామారెడ్డి, బతుకమ్మ : శుక్రవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్  ఆశిష్ సంగ్వాన్  ఆకస్మికంగా కామారెడ్డి పట్టణంలో పర్యటించి వివిధ డిపార్ట్మెంట్స్ యొక్క పనులను పర్యవేక్షించారు. ముందుగా కామారెడ్డి పట్టణంలో అమృత్ పథకంలో భాగంగా నిర్మాణం చేయబడుతున్న పైపు లైన్ పనులను కళాభారతి వద్ద  సంబంధిత పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మున్సిపల్ కమిషనర్ మరియు మెగా సంస్థ వారితో కలిసి పర్యవేక్షించి పనులను వేగవంతంగా చేయాలని ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలకు నీటి లైన్ ను ఏర్పాటు చేయలని ఆదేశించారు. అనంతరం కొత్త బస్టాండ్ వద్ద గల డ్రైనేజీ పూడిక తీయు కార్యక్రమాన్ని పరిశీలించి కూడికనుండి  తీసిన వ్యర్ధాన్ని  వెంటనే అక్కడి నుండి తొలగించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.  అనంతరం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను పరిశీలించి అక్కడ సిబ్బంది హాజరు, విద్యార్థుల హాజరు పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించిన అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డీఈవో, ఎంఈఓ, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.

Collector conducts surprise inspections at the district headquarters

Leave A Reply

Your email address will not be published.