24 C
Hyderabad
Sunday, August 2, 2026

సమస్యల పరిష్కార మార్గమే సామూహిక మధ్యవర్తం

Must read

📰 Generate e-Paper Clip

. . . జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరత లక్ష్మి

నిజామాబాద్ సిటి, బతుకమ్మ :

 

సామరస్య పూర్వకంగా సమస్యల పరిష్కార మార్గమే  సామూహిక మధ్యవర్తిత్వ కేంద్రం యెక్క ప్రాధాన ఉద్దేశమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరత లక్ష్మి అన్నారు. నగరంలోని దుబ్బ రోడ్డులోగల ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సామూహిక మధ్యవర్తిత్వ కేంద్రాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరత లక్ష్మి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఈ మధ్యవర్తిత్వ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ  కొంత మంది తటస్ద వ్యక్తులకు   ఎంపిక చేసి వారికి శిక్షణ కల్పించి  ఈ కేంద్ర నిర్వహణ భాదతను అప్పగించటం జరుగుతుందన్నారు.  ఒక్కో కేంద్రంలో 5 చొప్పున  కమ్యునిటి మీడియేషన్ వాలంటిర్స్ ఉంటారని వివరించారు. ప్రధానంగా ఈ మధ్యవర్తిత్వ కేంద్రం ద్వారా సామరస్య పూర్వకంగా సమస్యలను పరిష్కరించుకుంటారు. తగాదా పడే వ్యక్తులు నిష్పక్షపాత, తటస్ద మధ్యవర్తి ద్వారా ఐచ్చికంగా సహకరించుకుని వివాదాలు పరిష్కరించుకునే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను  అభినందించారు. ఈ కార్యక్రమంలో  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సివియర్ సివిల్ జడ్జ్  జి.ఉదయ్ భాస్కర్ రావ్, ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు, సంస్థ ప్రతినిధులు, ఇతర మధ్యవర్తిత్వ కేంద్ర నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article