హైదరాబాద్, బతుకమ్మ : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నిర్మాణ పనుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అధికారులను ఆదేశించారు. గద్దెల దగ్గర ఉన్న చెట్లను తొలగించవద్దని స్పష్టం చేశారు. అలాగే, గద్దెల వద్ద నాలుగు వైపులా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయాలని, గుడి చుట్టూ పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ సీఎస్, అధికారులు పాల్గొన్నారు.
