టిపిసిసి గీత సెల్ సెక్రటరీ రావుల వెంకట రమేష్ గౌడ్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ ఖ్యాతికి, సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తూ ప్రతి ఇంట్లో ఆడబిడ్డలకు ప్రత్యేకగా నిలుస్తుందని టీపీసీసీ గీత సెల్ సెక్రటరీ రావుల వెంకట రమేష్ గౌడ్ కొనియాడారు. తెలంగాణ ప్రజల అస్తిత్వం, ఆత్మగౌరవం, పోరాటం, సమైక రూపం, తల్లి ఆశీర్వాదం అన్ని కలగలిపిన నిండైన రూపమే తెలంగాణ తల్లి రూపమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన సోనియా గాంధీ ఆశీస్సులతో సీఎం రేవంత్ రెడ్డి కృషితో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ తల్లి విగ్రహా ఏర్పాటుకు అహర్నిశలు కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రజల పక్షాన కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు వెంకట రమేష్ గౌడ్ తెలిపారు.
