ఆదిలాబాద్, బతుకమ్మ :
ఆదిలాబాద్ జిల్లా భోరాజ్ మండలం హతిఘాట్‌లో చనాక-కొరాటా బ్యారేజ్ పంప్‌హౌస్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. లోయర్ పెనుగంగ్ ప్రాజెక్ట్ ప్రధాన కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, లొక్‌సభ సభ్యులు గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు
.

