29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో సీఎం భోజనం

Must read

📰 Generate e-Paper Clip

భద్రాద్రి కొత్తగూడెం, బతుకమ్మ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. రాష్ట్రంలోని ప్రతి నిరుపేద సన్నబియ్యంతో అన్నం తినాలన్న లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యం పంపిణీని ప్రారంభించిన నేపథ్యంలో ఒక లబ్దిదారుడి ఇంట్లో ఆ కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వయంగా సహపంక్తి భోజనం చేశారు. భద్రాచలం శ్రీ సీతారామ స్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న అనంతరం బూర్గంపాడు మండలం సారపాకలో సన్నబియ్యం లబ్దిదారుడు బూరం శ్రీనివాస్ ఇంట్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ,

CM dines at home of rice beneficiary

పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తో కలిసి సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి లబ్ధిదారుడి కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సన్నబియ్యం ఎలా ఉన్నాయంటూ కుటుంబ సభ్యురాలు తులసమ్మను వివరాలు అడిగారు. దొడ్డు బియ్యం పంపిణీ చేసినపుడు అసలు వాటిని తీసుకునేందుకే ఆసక్తి చూపేవాళ్లం కాదని చెప్పిన తులసమ్మ, ఇప్పుడు సన్నబియ్యం ఇవ్వడంతో

CM dines at home of rice beneficiary

కుటుంబానికి ఉపయోగంగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేశారు. 200 యూనిట్స్ వరకు ఉచిత కరెంట్, రూ.500 గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు అందుతున్నాయా అని సంక్షేమ పథకాల గురించి ముఖ్యమంత్రి వారిని ఆరా తీశారు. ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వల్ల తమకు ఎంతో ఉపయోగపడుతుందని తులసమ్మ ఆనందం వ్యక్తం చేశారు.

CM dines at home of rice beneficiary

More articles

Latest article