నందిపేట్, బతుకమ్మ :
హైదరాబాద్ లో పోలీస్ శాఖలో సిఐగా పనిచేస్తున్న అంకంపల్లి గంగాధర్ తాను చదువుకున్న ప్రభుత్వ పాఠశాలకు డెస్క్ బెంచిలను వితరణ చేసి సేవానిరతిని చాటుకున్నారు. తాను పుట్టి పెరిగిన సొంత గ్రామంలో ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రైమరీ పాఠశాల విద్యార్ధులు కింద కూర్చుండి చదువుకుంటుండగా ఆయన స్పందించి రూ.2.50 లక్షల సొంత నిధులతో కొత్త డెస్క్ బెంచిలను అందచేశారు. అనంతరం పాఠశాల విద్యార్ధులతో ముచ్చటించారు. ఈ సందర్బంగా సిఐ గంగాధర్ ను పాఠశాల తరుపున శాలువతో సత్కరించారు.

