బతుకమ్మ, ఏర్గట్ల: మండల కేంద్రంలో నిమ్మన రోజాకు సీఎంఆర్ఎఫ్ చెక్కును ఏర్గట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందజేశారు. ఇట్టి సందర్భంలో లబ్ధిదారులు మాట్లాడుతూ తమ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్ మంజూరు ఇప్పించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ కు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కూరాకుల బోర్రన్న,మేకల సాయన్న,మేడారం ముత్యం, రేండ్ల చిన్నోళ్ల రాజారెడ్డి, మెరుగు సురేష్,సలీం,పాల్గొన్నారు.
