ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం     

0 14,611

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ:రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ దేశంలో దక్షిణ కాశీగా పేరుపొందిన వేములవాడ రాజన్న ఆలయానికి అప్రతిష్ట తేవద్దని వివిధ పార్టీల నాయకులను కార్యకర్తలను కోరారు. ఆదివారం  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన బిజెపి కార్యకర్తలు ఒక్కసారి ఆలోచించాలని కోరారు. ఎన్నో సంవత్సరాల క్రింద నిర్మాణమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని విస్తరణలో భాగంగా నిర్మాణపు పనులు చేపట్టడం జరిగిందని ఈ పనిని బిజెపి నాయకులు అడ్డుకోవద్దని హితవు పలికారు. ఆగమశాస్త్ర నిపుణులు సూచనల మేరకే ఆలయ విస్తరణ పనులు జరుగుతాయన్నారు.గర్భగుడిని ముట్టుకోవడం లేదని,రాజన్న పూజలు యధావిధిగా కొనసాగుతాయని అన్నారు. కేవలం భక్తుల సౌకర్యార్థం భీమన్న గుడిలో కోడెముక్కులు నిత్య పూజలు జరుగుతాయని ఆలయ ఈవో రమాదేవి, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ తెలిపిన బిజెపి నాయకులు తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు. దేశంలో ఎన్నో పురాతన ఆలయాలను పునర్నిర్మాణం చేసినప్పుడు బాలాలయాలను నిర్మించి నిత్య పూజలు చేయడం పరిపాటిగా జరుగుతుందన్నారు.ఎన్నో రాష్ట్రాల నుంచి వేలాది సంఖ్యలో రాజన్న దర్శనం చేసుకుంటున్న భక్తులు రానున్న కాలంలో లక్షలాదిగా పెరుగుతారని వారి సౌకర్యార్థం ఆలయ నిర్మాణంలో విస్తరణ చేయడం తప్పేమీ కాదన్నారు.వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పూర్వజన్మలో చేసుకున్న పుణ్యఫలితంగానే ఈ జన్మలో ఆలయ విస్తరణ పనులు ఆయన చేతుల మీదుగా జరగడం ఆయనకు దక్కిన అదృష్టమన్నారు. దేవుని ముందు అందరం సమాన భక్తులమేనని శృంగేరి పీఠాధిపతి శ్రీ జగద్గురు పరిశీలన జరిగిన తర్వాతనే ఆలయ పనులు ప్రారంభమయ్యాయని అన్నారు. ఇప్పటికైనా కొన్ని వేల సంవత్సరాలకు చరిత్రలో నిలిచిపోయే విధంగా రాజన్న గుడిని సుందరీకరించడం ఈ ప్రాంతం చేసుకున్న అదృష్టంగా భావించాలన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎస్ కే సాబేర బేగం, వైస్ చైర్మన్ గుండాడి రామ్ రెడ్డి, నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు,నందికిషన్, గంట చిన్న లక్ష్మి,  మెండె శ్రీనివాస్,తిరుపతి గౌడ్,  మల్లారెడ్డి, గంట బుచ్చగౌడ్, బండారి బాల్ రెడ్డి,గుండ్ల శ్రీనివాస్, అంతర్పుల గోపాల్, రవి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.