ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం     

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ:రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ దేశంలో దక్షిణ కాశీగా పేరుపొందిన వేములవాడ రాజన్న ఆలయానికి అప్రతిష్ట తేవద్దని వివిధ పార్టీల నాయకులను కార్యకర్తలను కోరారు. ఆదివారం  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన బిజెపి కార్యకర్తలు ఒక్కసారి ఆలోచించాలని కోరారు. ఎన్నో సంవత్సరాల క్రింద నిర్మాణమైన శ్రీ రాజరాజేశ్వర...