ఆర్మూర్, బతుకమ్మ : పోరాట యోధుడు ఛత్రపతి శివాజీ 395వ జయంతి సందర్బంగా ఆర్మూర్ పట్టణములోని సంతోష్ నగర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పట్టణ కాంగ్రెస్ నాయకులు ఖాందేష్ సత్యం హాజరై శివాజీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వరకునయుడు సత్యనారాయణ, పాతూరి అన్వేష్, కళ్యాణ్, సాయి యువజన కాంగ్రెస్ నాయకులు గోక శరత్, భోగ గిరీష్, అన్వేష్, దీపక్ తదితరులు పాల్గొన్నారు.
