27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు చెక్ పోస్టులు

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా కలెక్టరు ఆశిష్ సాంగ్వాన్

 

కామారెడ్డి, బతుకమ్మ : ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. డిస్ట్రిక్ట్ లెవల్ సాండ్ కమిటీ సమావేశం బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో హస్గుల్, కుర్లా గ్రామాలకు స్టానిక అవసరాలకు సంబoధిoచి ఇసుక లభ్యత , దాని పర్యావరణ అనుమతులు, మట్టికీ సంబoధిoచి కనీస పరిమాణము లో స్థానిక అవసరాలకు తహసిల్దారులకు అనుమతి ఇచ్చి సులబమైన పద్దతి, ఇసుక రవాణా నియంత్రించడం లో చెక్ పోస్టులు పెట్టేందుకు కావలసిన ఏర్పాట్ల గురించి చర్చించారు. ఈ సమావేశములో అదనపు కలెక్టర్  వి.విక్టర్, అడిషనల్ ఎస్పీ  కె.ఎన్. రెడ్డి, సహాయ సంచాలకులు గనులు, భూగర్భ శాఖా (ఇంచార్జ్) నాగేశ్,  సతీశ్ యాదవ్, జిల్లా భూజల శాఖా,  సాలుమాను, ఇ.ఇ. ఇరిగేషన్ శాఖా, శ్రీనివాస్ అదికారులు పాల్గొన్నారు.

Check posts to control illegal sand trafficking

More articles

Latest article