- జిల్లా కలెక్టరు ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి, బతుకమ్మ : ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. డిస్ట్రిక్ట్ లెవల్ సాండ్ కమిటీ సమావేశం బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో హస్గుల్, కుర్లా గ్రామాలకు స్టానిక అవసరాలకు సంబoధిoచి ఇసుక లభ్యత , దాని పర్యావరణ అనుమతులు, మట్టికీ సంబoధిoచి కనీస పరిమాణము లో స్థానిక అవసరాలకు తహసిల్దారులకు అనుమతి ఇచ్చి సులబమైన పద్దతి, ఇసుక రవాణా నియంత్రించడం లో చెక్ పోస్టులు పెట్టేందుకు కావలసిన ఏర్పాట్ల గురించి చర్చించారు. ఈ సమావేశములో అదనపు కలెక్టర్ వి.విక్టర్, అడిషనల్ ఎస్పీ కె.ఎన్. రెడ్డి, సహాయ సంచాలకులు గనులు, భూగర్భ శాఖా (ఇంచార్జ్) నాగేశ్, సతీశ్ యాదవ్, జిల్లా భూజల శాఖా, సాలుమాను, ఇ.ఇ. ఇరిగేషన్ శాఖా, శ్రీనివాస్ అదికారులు పాల్గొన్నారు.
