మద్నూర్, బతుకమ్మ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హాస్టల్స్ నిర్వహణ లో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకే గురువారం మేనూర్ గ్రామంలో గల మోడల్ స్కూల్ హాస్టల్ ను మద్నూర్ మండల తహసిల్దార్ ఎం.డి ముజీబ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంట గది, హాస్టల్ పరిసరాలను తిరిగి పరిశీలించారు.

విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి రుచి చూశారు. విద్యార్థుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని హాస్టల్ కేర్ టేకర్ ను ఆదేశించారు. హాస్టల్ శుభ్రత, విద్యార్థుల ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధతో వ్యవహరించాలని అన్నారు.

