27న ఛలో గాంధారి

0 14,541

కామారెడ్డి, బతుకమ్మ :  ఈనెల 27న ఛలో గాంధారి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాణా ప్రతాప్ రాథోడ్, జిల్లా అధ్యక్షులు నునావత్ గణేష్ నాయక్ తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.  కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో గిరిజన గర్జన సభ పెట్టాలని నిర్ణయించామని, ఆదివారం మారుతి ఫంక్షన్ హాల్ లో సభ నిర్వహిసుతన్నట్లు పేర్కొన్నారు.  సదస్సుకు ముఖ్య అతిథులుగా డిప్యూటీ స్పీకర్ రామచందర్ నాయక్,  గిరిజన కార్పోరేషన్ చైర్మన్ డాక్టర్ తేజావత్ బెల్లయ్య నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ వస్తున్నారని తెలిపారు.  ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బద్రి నాయక్, గౌరవ అధ్యక్షులు  రూప్ సింగ్ నాయక్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్  శంకర్ నాయక్,  నాయకులు ప్రేమ్,  ప్రకాష్ నాయక్, విజయ్, రవీందర, శ్రీను నాయక్, పీర్ సింగ్ నాయక్, పరశురాం బన్సీలాల్ నాయక్, దేవి సింగ్,  మోహన్, గోపి నాయక్, వసంత్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.