నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని ఓ వృద్దురాలి మెడలో నుంచి అగంతకులు చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. ఈ సంఘటన వినాయక్ నగరలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఓ ఇంట్లోకి ప్రవేశించిన అగంతకులు ఒంటరిగా ఉన్న వృద్దురాలు(70) నర్సుబాయిను మాటలు దింపి ఆమె మెడలో నుంచి రెండున్నర తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని సంఘటన స్థలాన్ని 4వ టౌన్ ఎస్సై శ్రీకాంత్ పరిశీలించారు. ఘటన స్థలంలో ఉన్నసీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. చైన్ స్నాచింగ్ కు పాల్పడిన అగంతకులు ఒకరా, ఇద్దరా అనే పరిశోధన జరుగుతుంది.
