. . . తహసీల్దార్ బాలయ్య
ఇందల్వాయి, బతుకమ్మ :
జనాభా గణన, గృహ గణన లకు సంబంధించిన సర్వే జూన్ 6 లోగా పూర్తి చేయాలని ఇందల్వాయి తహసీల్దార్ బాలయ్య మంగళవారం సూచించారు. సర్వేకు సంబంధించిన సూపర్వైజర్లతో మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గ్రామాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్యుమరేటర్ లతో సర్వే త్వరితగతిన నిర్వహించి ప్రభుత్వానికి సకాలంలో నివేదిక అందించాలని తహసీల్దార్ బాలయ్య ఆదేశించారు. గ్రామాలలో తప్పిపోయిన ఇండ్లు ఉంటే చాటింపు ద్వారా కానీ, మైక్ అనౌన్స్మెంట్ ద్వారా కానీ, ఎన్యుమరేటర్ లతో సర్వే చేయించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
