నిజామాబాద్, బతుకమ్మ: తమ డిమండ్ లను నెరవేర్చాలని రాష్ర్ట ప్రభుత్వ పెన్షనర్లు జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో తెలంగాణ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. అసోసియేషన్ డివిజన్ అధ్యక్షుడు సిర్ప హనుమాండ్లు అధ్యక్షతన నిర్వహించిన ధర్నాను జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రావు ప్రారంభించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల మేరకు పెండింగ్ లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని, పే రివిజన్ కమిషన్ ను 40% ఫిట్ మెంట్ తో వెంటనే అమలు చేయాలని, లక్షలాది రూపాయల మెడికల్ బిల్లులు ఈ కుబేర్ లో మూలుగుతున్నాయని , సంవత్సరాల తరబడి ప్రభుత్వానికి, సమాజానికి, ప్రజలకు, సేవలు అందించిన రిటైర్డ్ ఉద్యోగులపై ప్రభుత్వ వైఖరి మారాలని ఆయన డిమాండ్ చేశారు. ధర్నాలో ప్రధాన కార్యదర్శి మదన్ మోహన్, కోశాధికారి ఈవీఎల్ నారాయణ, జిల్లా నాయకులు ప్రసాద్ రావు, లావు వీరయ్య, లక్ష్మీనారాయణ, బన్సీలాల్, రాధాకిషన్, వి వెంకటరావు, కృష్ణారావు, జ్ఞానేశ్వర్, హమీద్, తదితరులు పాల్గొన్నారు.
