24.1 C
Hyderabad
Monday, August 3, 2026

లైంగిక ఆరోపణలపై బీర్కూర్ పీహెచ్ సి మెడికల్ ఆఫీసర్ పై కేసు

Must read

📰 Generate e-Paper Clip

 

బాన్సువాడ, బతుకమ్మ :

లైంగిక ఆరోపణలపై బీర్కూర్​ పీహెచ్​సీ మెడికల్ ఆఫీసర్ పై బీర్కూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే బీర్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లైంగిక వేధింపులకు ఓ మహిళా ఉద్యోగి పి హె సీ వైద్యాధికారి లింగాల నాగ గిరీష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.బాధితురాలి ఫిర్యాదు మేరకు బీర్కూర్ పోలీసులు కేసు నమోదు చేసి, వైద్యాధికారి లింగాల నాగ గిరీష్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఇన్​ఛార్జి డిప్యూటీ డీఎంహెచ్‌వో రోహిత్ కుమార్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకుని వైద్య సిబ్బంది కేసు వివరాలు విచారణ జరిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి తదుపరి అధికారులు నివేదిస్తామని తర్వాత ఉన్నతాధికారులు వైద్యాధికారి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

More articles

Latest article